MNCL: కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టీజేఎస్ నిలుస్తుందని తెలిపారు.