MDK: పాఠశాల క్రీడా సమాఖ్య(ఏసీఎఫ్) ఆధ్వర్యంలో నల్గొండలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం సాధించింది. మూడో స్థానం కోసం రంగారెడ్డితో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియగా, పెనాల్టీ షూటౌట్లో మెదక్ జట్టు 4-3 స్కోరు తేడాతో విజయం సాధించిందని ఏసీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు.