KMM: సీపీఐ (ఎం) పార్టీ నాయకుడు సామినేని రామారావు హత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు తెలిపారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దోషులను కఠినంగా శిక్షించే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని, దీనికి ప్రజాస్వామ్య ప్రజాతంత్ర వాదులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.