NGKL: కోడేరు మండలంలోని రాజాపూర్‌లో సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. అర్చకులు సుమలత భాస్కరశర్మ, సంతోష్ భరద్వాజ్ ఆధ్వర్యంలో గణపతి పూజ, ఆంజనేయ హోమం, యంత్రం స్థాపన, అభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని తమలపాకులతో అలంకరించి నైవేద్యం సమర్పించారు.