ATP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గుంతకల్లులో కొనసాగింది. ఆదివారం పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ భవాని ఈ కార్యక్రమం చేపట్టారు. 27వ వార్డు ఇంఛార్జి దాసరి హరిబాబు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.