ADB: బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని బోథ్కి చెందిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్&ఇన్ఫ్రా స్ట్రక్చర్ GM డా. రుక్మారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణ బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు ఆగిపోయాయని సూపరింటెండెంట్ డా.రవికుమార్ తెలిపారు. ఈ మేరకు నిధులు విడుదల అయ్యేలా చూస్తానన్నారు.