WNP: మర్రికుంట ధర్నా చౌక్ వద్ద బీసీల న్యాయ సాధన దీక్షకు బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్ పాల్గొని సంఘీభావం తెలిపారు. బీసీ జేఏసీ పిలుపు మేరకు తాము మద్దతు ప్రకటించామని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలును అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ, పోరాటం విజయవంతమయ్యే వరకు మద్దతుగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.