ADB: ఆర్టీసీ బస్టాండ్‌లో ఇవాళ భారీ చోరీ చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన గుర్మిత్ ఆదిలాబాద్ వ్యాపారులకు వెండి అభరణాలను సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తన బ్యాగులో రూ.95 వేల నగదు, 5 కిలోల వెండి అభరణాలతో బస్టాండ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఒక బస్సులో తన సంచిని ఉంచి కిందకి దిగి మళ్లీ బస్సు ఎక్కి చూడగా సంచి కనబడలేదు. దీంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.