HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ఆదివారం AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ఎన్నికల్లో తమకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు, తన విజయంలో పోషించిన కీలక పాత్రకు ఓవైసీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలకు, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని నవీన్ యాదవ్ పేర్కొన్నారు.