GNTR: పెదకాకాని వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో NH-16 రోడ్ పక్కన నిర్మించిన శ్రీమతి గుంటుపల్లి శారదా దేవి స్మారక గ్రంథాలయ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రారంభించారు. గ్రామాల్లో గ్రంథాలయాలు స్థాపించటం యువతలో చైతన్యం, జ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పుస్తకాల ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.