MBNR: జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆదివారం శ్రీరామ రక్షా స్తోత్ర- హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.