WGL: జిల్లా కేంద్రంలోని DCC భవన్లో ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.