ప్రకాశం: కొమరోలు మండలం నల్లగుంట్ల సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి నందిని అనే వివాహిత మృతి చెందింది. కొమరోలు నుంచి గిద్దలూరుకు ద్విచక్ర వాహనంపై తన ఇద్దరు పిల్లలు భార్యతో కలిసి వెంకటరమణ వెళ్తుండగా నల్లగుంట్ల వద్ద అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నందిని మృతిచెందగా, పిల్లలకు గాయాలయ్యాయి.