ప్రకాశం: మార్కాపురం శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఎఫ్ఎస్సీ కార్యదర్శి శివారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు సీనియర్, జూనియర్ విభాగాలలో పాటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతి ప్రధానం చేసినట్లు శాఖ గ్రంథాలయం ఇంఛార్జి సుబ్బారెడ్డి తెలిపారు.