KRNL: రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అన్ని విధాల కృషి చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం కర్నూలులోని వివిధ కులస్థులకు సంబంధించిన వనభోజనాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా, కేవలం పదవులు మాత్రమే ఇచ్చి అలంకార ప్రాయంగా చేశారన్నారు.