SKLM: సంతబొమ్మాళి మండలం నరసాపురం పంచాయతీలో గల పందిగుంట గ్రామంలో ఇద్దరు చిన్నారులు నీటిగుంటలోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఆదివారం మృతిచెందారు. ముద్ద అవినాష్ (9) సుధీర్ (8) స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. వారితో వెళ్లిన తోటి చిన్నారులు కుటుంబానికి సమాచారం తెలియజేయడంతో అక్కడికి వెళ్లి మృతదేహాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.