HNK: జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (JNS)లో ఇవాళ నిర్వహించిన సమావేశంలో మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు వెలికితీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డెఫ్ ఒలింపిక్స్ 2025లో గోల్డ్ మెడల్ గెలిచిన షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు రూ.1.20 కోట్ల నజరానా ప్రకటించారు.