ప్రకాశం: పెదచెర్లోపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ గెస్ట్ అధ్యాపకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇవాళ ప్రిన్సిపల్ తారకనాథ్ కోరారు. ఆసక్తి కలిగిన వారు పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ మార్కుల జాబితా, రెజ్యూమ్‌ను కళాశాలలో ఈనెల 20వ తేదీ లోపు అందజేయాలని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.