SAA తో 3 మ్యాచ్ల అనధికార వన్డే సిరీస్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో INDA విజయం సాధించింది. 132 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 27.5 ఓవర్లలో ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (68*) అర్ధశతకంతో రాణించాడు. అభిషేక్ శర్మ (32), తిలక్ వర్మ (29*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SAA 30.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది.