ప్రకాశం: పామూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జి వరకూటి నాగరాజు మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కష్టపడి పని చేసే వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవకి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.