NLG: చింతపల్లి మండలంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సోమవారం పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు చింతపల్లిలోని పెద్ద చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.