ATP: బెళుగుప్ప మండల వైద్య అధికారి డా. కార్తీక్ రెడ్డి ఆదివారం సాయంత్రం పంపనూరు సమీపంలోని కాలువలో దిగి గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ ఇంతవరకు లభించలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది.