MDK: మైదాన ప్రాంత గిరిజనులకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఇవాళ శివంపేటలో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. 12 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు గిరిజనులకు కేటాయించి, అందులో మైదాన ప్రాంత గిరిజనులకు ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం కేటాయించాలన్నారు.