ADB: ఈ నెల 25వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో CITU ఆధ్వర్యంలో జరిగే 5వ మహాసభను జయప్రదం చేయాలని అంగన్వాడీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం నార్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో సమావేశమయ్యారు. అంగన్వాడీలకు ఉన్న సమస్యలపై చర్చించనున్నామని ఆమె పేర్కొన్నారు.