KMM: సత్తుపల్లి పట్టణం 11వ వార్డు వెంగళరావు నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గృహప్రవేశానికి హాజరైన మంత్రి లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన వెల్లడించారు.