NRPT: తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందని మోసగాళ్లు చెప్పే గొలుసుకట్టు (Multi-Level Marketing) వ్యాపారాల జోలికి ప్రజలు వెళ్లవద్దని జిల్లా ఎస్పీ వినీత్ హెచ్చరించారు. ఈ వ్యాపారాల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, మాయ మాటలు నమ్మి మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను కూడా నమ్మకూడదని తెలిపారు.