AP: డిప్యూటీ సీఎం పవన్ పేషీలో లేని సురేష్ అనే వ్యక్తి.. పేషీలో పనిచేస్తూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లుగా YCP తప్పుడు ఆరోపణలు చేస్తుందని జనసేన మండిపడింది.’ పవన్ నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా వస్తున్న తప్పుడు వార్తలను జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నిరాధార ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ న్యాయ విభాగం సిద్ధమైంది’ అని పేర్కొంది.