సిరిసిల్ల: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ఎస్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల అశోక్ నగర్‌కు చెందిన చింతకింది సోమయ్య (55) ఆర్థిక ఇబ్బందులతో మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆదివారం ఉదయం వాగులో శవం లభ్యం కాగా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.