CTR: శాంతిపురం మండలంలో హంద్రీనీవా కాలువను ఆదివారం ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారాం పరిశీలించారు. వారం రోజులుగా హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా వస్తోంది. ఇప్పటికే కుప్పం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో పలు చెరువులకు నీటిని మళ్లించారు. వారు మాట్లాడుతూ.. హంద్రీనీవాతో కుప్పం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు.