BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలో కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈవో రజిని కుమారి తెలిపారు. సెలవు దినం కావడంతో పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని పెద్దమ్మను దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.