KMM: వైరా రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను తీసుకెళ్లి మధిర నియోజకవర్గాన్ని తడుపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వైరా మండలం సోమవరం గ్రామ సమీపంలో ఉన్న మామిడి తోటలో ఆదివారం కమ్మ మహాజన వనసమారాధన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సంక్రాంతి కల్లా ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.