MBNR: జిల్లాలోని 16వ నంబర్ మద్యం దుకాణానికి ఈ నెల 19న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రీ టెండర్ నిర్వహించనున్నారు. గతంలో ఈ దుకాణాన్ని దక్కించుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. ఆమె తన లైసెన్స్‌తో పాటు మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని ఆమె వినతి పత్రం ఇచ్చింది. దీంతో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.