ఏలూరు నగరంలోని రెండో పట్టణ పరిధిలోని బడేటివారి వీధిలో గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్సై మధు వెంకటరాజా వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా అతని వద్ద ఎటువంటి వివరాలు లభించలేదు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.