ATP: నార్పల మండలం దుగ్గిమర్రికి చెందిన 19 ఏళ్ల కె.కుసుమ 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడంపై ఎమ్మెల్యే బండారు శ్రావణి హర్షం వ్యక్తం చేశారు. శిఖరంపై భారత జెండాతో పాటు ముఖ్య నేతల ఫోటోలను ఎగురవేయడం గర్వకారణమన్నారు. కుసుమకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని, సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.