ELR: కైకలూరు మండలం కొల్లేటికోటలో వేంచేసియున్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అమ్మవారికి వివిధ రకాలుగా రూ.23,475 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు.