MDK: అల్లాదుర్గ్ మండలం చిల్వర్కు చెందిన మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముక్కెర నర్సింహ రెడ్డి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ చిల్వర్ చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీకి, ప్రజలకు నర్సింహ రెడ్డి సేవలు అమూల్యమైనవని మంత్రి కొనియాడారు.