ELR: గణపవరం మండలం అర్థవరంలో రాష్ట్ర ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ CII సమ్మిట్ నిలిచిందన్నారు. గతంలో రాయలసీమలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేసిన కంపెనీలు, ఇప్పుడు ప్రభుత్వ స్థిరత్వం, పారదర్శకత చూసి ముందుకు వస్తున్నాయన్నారు.