TPT: కేవీబీపురం మండలం రాయలచెరువుకు గండిపడడంతో పాతపాళెం, కళత్తూరు అరుంధతి వాడలోని 800 కుటుంబాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితులకు పలువురు దాతలు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వరదలో భారీ ఆస్తి నష్టం జరిగిందని వారిని ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తున్నామని చెప్పారు.