MBNR: బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చి అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బీసీ జాగృతిసేన, జేఏసీ ఆధ్వర్యంలో జడ్చర్లలో చేపట్టిన ధర్మదీక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై సంతకం చేసి మద్దతు ప్రకటించారు. బీసీలకు సమాన అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుదల, న్యాయం చేసేందుకు ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు.