SKLM: సంతబొమ్మాళి(M) భావనపాడు సముద్రపు బీచ్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. కార్తికమాసం చివరి ఆదివారం కావడంతో మండలంతో పాటు జిల్లాలో కల వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి జీడి, సరుడు తోటలో పిక్నిక్ భోజనాలు నిర్వహించుకున్నారు. సముద్రంలో స్నానాలు చేసి కేరింతలు కొట్టారు. కుటుంబాలతో పాటు స్నేహితులు, పాఠశాలలు, కళాశాలలు చెందిన విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.