KNR: హుజురాబాద్ పట్టణ పరిధిలోని ఒకటో వార్డు కొత్తపల్లిలో గౌరవేని లక్ష్మీ ఇందిరమ్మ నూతన గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రణవ్ హాజరయ్యారు. గృహప్రవేశ సమయంలో లబ్ధిదారు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటి నిర్మాణం కోసం ఇన్నేళ్లుగా ఎదురుచూశామని, ఇప్పుడు ఇళ్లు కట్టుకొని గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.