ELR: ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై ఆదివారం దాడులు చేసినట్లు ఎస్సై శుభశేఖర్ తెలిపారు. ఈ దాడులలో ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.3500, ఐదు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.