CTR: కుప్పంలో శ్రీనాథ్‌ను దారుణంగా హతమార్చిన ప్రభాకర్‌ను కడప జైల్లో జగదీశ్ పరిచయమయ్యాడు. గతంలో ఓ హత్య కేసులో ప్రభాకర్ ఐదున్నరేళ్లపాటు కడప జైల్లో శిక్ష అనుభవించాడు. వీరు 2021లో శిక్ష పూర్తి చేసుకుని విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో నిందితులు గత నెల 27న శ్రీనాథ్‌ను కుప్పం పిలిపించి జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో హత్య చేసి బెడ్ రూమ్‌లో పూడ్చిపెట్టారు.