HYD: హైదరాబాద్లో దాంపత్య జీవితం క్రమంగా బలహీనపడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ప్రేమపెళ్లి, అనుకోని పెళ్లి, ఏరూపంలో జరిగినా చాలామంది జంటలు చిన్నచిన్న విషయాలకే కోర్టు మెట్లెక్కుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ కోర్టుల రికార్డుల ప్రకారం ప్రతినెలా సుమారు 250 విడాకుల కేసులు నమోదవుతున్నాయి.