NZB: ప్రపంచ రికార్డు నెలకొల్పిన మాలవత్ పూర్ణ తండ్రి మాలవత్ దేవిదాస్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, మాజీ ఆర్టీసీ ఛైర్మన్, బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం పాకాల గ్రామానికి చేరుకున్నారు. పూర్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ మేరకు అవసరమైన సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.