NLG: వేములపల్లి మండలంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో APకు చెందిన బొడ్డు శ్రీనివాస్ దుర్మరణం చెందాడు. స్థానిక వివరాల ప్రకారం.. మిర్యాలగూడ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆయనను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ కిందపడగా, ట్రాక్టర్ మీద నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.