KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. సమస్యలను త్వరగా పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు.