W.G: భీమవరంలో ఆదివారం నిర్వహించిన ‘హిందూ వనవిహార్’ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్తీక మాస పుణ్య ఘడియల్లో, హిందూ ధర్మానికి చెందిన జీవన మౌలిక సిద్ధాంతాలను, వన భోజనాల విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించాలనే పవిత్ర సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.