WGL: ఉమ్మడి జిల్లా మహానగరాన్ని ఒకే జిల్లాగా ప్రకటించి ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఉద్యమకారుల ఐక్యవేదిక ఛైర్మన్ వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ఇవాళ హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్పోర్టు విస్తరణ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, లక్నవరం, రామప్ప, భద్రకాళి వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.