MDK: నార్సింగి మండల కేంద్రంలోని కాముని చెరువు సమీపంలో సీజ్ చేసిన ఇసుకను రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ గ్రేసీబాయి తెలిపారు. జిల్లా మైనింగ్ అధికారుల ఆదేశాల మేరకు అక్రమంగా నిల్వ ఉంచిన 15 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు వివరించారు. ఆసక్తి గలవారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు.